APPSC/TSPSC Exams - AP HISTORY Questions with Explanation


1. విష్ణుకుండినులు ఏర్పాటు చేసిన 'ఘటికలు' అంటే ఏమిటి?
1) వర్తక కేంద్రాలు
2) ఓడరేవు కేంద్రాలు
3) విద్యా కేంద్రాలు
4) పన్నులు
జ.3
వివరణ: సంస్కృత భాషలో బోధించే విద్యా కేంద్రాలను 'ఘటికలు' అంటారు. తెలుగు
నేలలో విష్ణుకుండినులు వీటిని ప్రథమంగా ఏర్పాటు చేశారు. భాష, సాహిత్యంను వీరు ప్రోత్సహించారు. ఘటికలలో వేదాల అధ్య
యనం కీలకమైంది.

2. 'త్రివర నగర భవనగత సుందరీ హృదయ నందన' అనే బిరుదు ఉన్న విష్ణుకుండిన రాజు?
1) రెండో మాధవ వర్మ
2) మొదటి గోవింద వర్మ
3) రెండో విక్రమేంద్ర వర్మ

4) రెండో ఇంద్రవర్మ
జ. 1;
వివరణ: పొలమూరు శాసనం ప్రకారం రెండో మాధవ వర్మకు ఉన్న బిరుదు ఇది. త్రివర నగరం నర్మదా నదిపై ఉన్న జబల్ పూర్ సమీపంలోని 'త్రిపురి' అని కొందరి అభిప్రాయం. రెండో మాధవ వర్మ కాలాన్ని విష్ణుకుండినుల పాలనా చరిత్రలో 'స్వర్ణయుగం' అంటారు.

3. 'ఉత్పత్తి పిడుగు' అనే లేఖనం ఎక్కడ లిఖించారు?
1) మొగల్రాజపురం
2) భైరవకోన
3) ఉండవల్లి

4) గుమ్మడిదుర్రు
జ. 3;
వివరణ: విష్ణుకుండినుల కాలంలో మొగల్ రాజపురంలో ఐదు గుహలు ప్రాధాన్యత పొందాయి. ఇందులో అర్ధనారీశ్వరమూర్తి విగ్ర హం ఉంది. భైరవకోన 8 గుహలు కలిగిన శివాంకిత ప్రాంతం. ఉండవల్లిలో అనంతశ యనశాయి విగ్రహం ప్రాధాన్యత పొందింది. గుమ్మడిదుర్రు ప్రముఖ బౌద్ధ క్షేత్రం.
4.భైరవకోనలోని ఎనిమిది గుహలు దేవునికి అంకితం చేశారు?
1) విష్ణువు
2) ఇంద్రుడు
3) బ్రహ్మ
4) శివుడు
జ.4
వివరణ: భైరవకోనలో విష్ణుకుండినులు 8 గుహలను తొలిపించారు. ఇవి అన్నీ శివునికి అంకితం చేశారు. ఇక్కడే త్రిముఖ దుర్గ విగ్రహం కూడా ఉంది. కుంభ శీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలు ఉన్నాయి. కాపాలికులకు ప్రాంతం రెండో కేంద్రం శ్రీశైలం (మొదటిది).
5. భూత గ్రహస్వామి అని దేవునిని అంటారు?

1) వినాయకుడు
2) యమధర్మరాజు
3) బ్రహ్మదేవుడు

4) పరమేశ్వరుడు
జ. 2;
వివరణ: విష్ణుకుండినుల కాలంలో యముడి ని భూతగ్రహస్వామి అని పిలిచేవారు. వినాయకుడిని దంతముఖస్వామి అని వ్యవహరించారు. తర్వాత బ్రహ్మను పద్మ సంభవుడు అని, పరమేశ్వరుని అర్ధనారీశ్వ రుడు అని అంటారు. వివిధ కాలాల్లో ఈ పేర్లుతో దేవుళ్ళను పిలిచేవారు.
6. జతపరచండి.
జాబితా-1
1. అర్ధనారీశ్వర గుహాలయం
2. త్రిముఖ దుర్గ శిల్పం
3. పూర్ణకుంభం
4. బౌద్ధ క్షేత్రం జాబితా-2
. బొజ్జన్నకొండ
బి. ఉండవల్లి
సి. భైరవకోన
డి. మొగల్రాజపురం
1) 1-డి, 2-బి, 3-, 4-సి
2) 1-బి, 2-డి, 3-సి, 4-
3) 1-డి, 2-సి, 3-బి, 4-

4) 1-సి, 2-, 3-డి, 4-బి
: 3;
వివరణ: విష్ణుకుండినులు వివిధ ప్రాంతాల లో తమ శిల్పకళలు విస్తృతపరిచారు. అర్ధ నారీశ్వరుడు అంటే శివుడు స్త్రీ, పురుష భంగిమలో కనిపిస్తాడు, దుర్గమాతకు మూడు ముఖాలతో భైరవకోనలో శిల్పీకరణ చూపరులను ఆకట్టుకుంటుంది. ఉండవ ల్లిలో ఉన్న పూర్ణకుంభంను చూసి సూరిశెట్టి ఆంజనేయులు చిత్రీకరించారు. దీనినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నంగా స్వీకరించారు. (ఇప్పుడు పూర్ణఘటం). బొజ్జన్నకొండలో బుద్ధుణ్ణి బొజ్జన్న అని పిలుస్తారు.
7.విష్ణుకుండినులు తమ రాజ్యంను దేనితో పోల్చుకున్నారు?
1) పాంచజన్యం
2) ఖట్వాంగం

3) కౌస్తుభం
4) స్వస్తిక్
జ. 3;
వివరణ: కౌస్తుభం అనేది మహా విష్ణువు రత్నం. ప్రపంచంలో అత్యంత విలువైనదిగా పేర్కొంటారు. ఖట్వాంగం శివుని ఆయు ధం, పాంచజన్యం శ్రీకృష్ణుని శంఖం, స్వస్థిక్
సర్వాభివృద్ధికి సంకేతం.
8. విష్ణుకుండినుల రాజ్యాన్ని అంతం చేసిన పశ్చిమ చాళుక్య రాజు?
1) మొదటి పులకేశి
2) మంగళేసు
3) రెండో పులకేశి
4) రవికీర్తి
జ.3
వివరణ: చివరి విష్ణుకుండిన రాజు అయిన మంచన భట్టారకుడిని ఓడించి క్రీ..624లో రెండో పులకేశి రాజ్యాన్ని ఆక్రమించాడు. తర్వాత తన సోదరుడైన కుబ్జవిష్ణువర్ధనుడికి రాజ్యాన్ని ఇచ్చాడు. రాజ్యమే వేంగి సామ్రాజ్యంగా అభివృద్ధి చెందింది.
9. గజదళాధిపతిని ఏమని పిలుస్తారు?

1) హస్తికోశ
2) వీరకోశ

3) స్కంధావారం
4) గుల్మిక
జ. 1;
వివరణ: హస్తి అంటే ఏనుగు లేదా గజరాజు. రకమైన దళాన్ని హస్తికోశ అని పిలుస్తారు. ఏనుగుల దళం యుద్ధ సమయాలలో అత్యంత కీలకమైన దళం. వీరకోశ అంటే పదాతి దళం. స్కంధావారం అంటే శాతవాహనుల కాలం నాటి తాత్కా లిక సైనిక శిబిరం, గుల్మిక అంటే సరిహద్దు రక్షణాధికారి అని శాతవాహనుల కాలం వివరాల ద్వారా తెలుస్తుంది.
10. శాలంకాయన రాజు హస్తివర్మ కాలంలో వేంగిపై దండెత్తిన గుప్తరాజు ఎవరు?
1) శ్రీగుప్తుడు
2) మొదటి చంద్రగుప్తుడు

3) సముద్రగుప్తుడు
4) భానుగుప్తుడు
జ. 3;
వివరణ: అలహాబాద్ శాసనం ప్రకారం గుప్తరాజు సముద్రగుప్తుడు తన దక్షిణ దిగ్విజయ యాత్రలలో భాగంగా వేంగిపై దండెత్తాడు. శాసనంను హరిసేనుడు రచించాడు. గోదావరి నది ప్రాంత విషయా లు శాసనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
11. చిత్రరథస్వామి పాదభక్తులము అని చెప్పు కున్న రాజులు?
1) విష్ణుకుండినులు
2) ఇక్ష్వాకులు
3) శాతవాహనులు

4) శాలంకాయనులు
జ. 4;
వివరణ: శాలంకాయనుల ఆరాధ్య దైవం చిత్రరథస్వామి. దైవ స్వరూపంను సూర్యుడు అని, కొందరు శివుడు అని వ్యవ హరిస్తున్నారు. శాలంకాయన అంటే నంది అని అర్థం. టాలమీ లాంటి విదేశీయులు వీరిని గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు.
12. సప్త మాతృక విగ్రహాలు ఉన్న ప్రాంతం ఏది?

1) నారాయణ వనం
2) నందిగామ
3) సోమశిల

4) చేజెర్ల
జ. 4:
వివరణ: తొలిసారి శక్తి ఆరాధనకు హారితీ దేవాలయం (నాగార్జున కొండ), పెదముడి యాల మొదలగు ప్రాంతాలను ఉదహ రించవచ్చు. దేవాలయాలలో సప్తమాతృక లను నెలకొల్పి ఆరాధించేవారు. చేజెర్లలో సప్తమాతృకల విగ్రహాలున్నాయి. ఆదిపరా శక్తి రూపాలే ఇవి. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండి రూపాలు.

13.త్రిమూర్తి ఆరాధనకు ప్రాచీన ఆంధ్ర దేశంలో లభించిన ఆధారం ప్రాంతంలో ఉంది?
1) భైరవకోన
2) సంగమయ్య గుహ
3) బెలుంగుహలు
4) ఏనుగు మల్లమ్మ కొండలు
జ. 1
వివరణ: భైరవకోనలో శివునికి ద్వారపాల కులుగా బ్రహ్మ, విష్ణు శిల్పాలు ఉన్నాయి.
ప్రాంతం కాపాలికులకు రెండో కేంద్రం (మొదటిది శ్రీశైలం), సంగమయ్య గుహ శ్రీకాకుళంలో, బెలుంగుహలు కర్నూలులో, ఏనుగు మల్లమ్మ కొండలు మదనపల్లి (చిత్తూరు)లో చారిత్రాత్మక ప్రాంతాలు.

14. జతపరచండి.
రాజవంశం: 1. వేంగి చాళుక్యులు 2. ఆనంద గోత్రజులు 3. విష్ణుకుండినులు 4. రాష్ట్రకూటులు చిహ్నం : . వృషభం బి. వరాహం సి. పంజా విసిరిన సింహం డి. గరుడ
1) 1-, 2-సి, 3-డి, 4-బి
2) 1-బి, 2-, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-బి, 4-
4) 1-డి, 2-బి, 3-, 4-సి
జ.2
వివరణ: వరాహం వేంగి చాళుక్యుల చిహ్నం. రూపం విష్ణువు మూడో అవతారం (దశావతారాలలో). వృషభం ఆనంద గోత్రజుల చిహ్నం. పంజా విసిరిన సింహం
విష్ణుకుండినుల చిహ్నం. రాష్ట్రకూటుల చిహ్నం గరుడ (విష్ణువు వాహనం).
15. బృహత్పలాయనుల రాజధాని ఏది?

1) వేంగి
2) కోడూరు
3) తుమ్మలగూడెం
4) హన్మకొండ
2:
వివరణ: కోడూరు లేదా గుడూరు కృష్ణా జిల్లా మచిలీపట్నం అని గుర్తించారు. ఇది బృహత్పలాయనుల రాజధాని. వేంగి శాలం కాయనుల రాజధాని తర్వాత తూర్పు చాళుక్యుల రాజధాని, తుమ్మలగూడెం విష్ణు కుండినుల రాజధాని, హన్మకొండ తొలి
కాకతీయుల రాజధాని.
16. గోలాంగులము అంటే?

1) గరుడ
2) కోతి
3) పంజా విసిరే సింహం
4) సింహం
జ. 2
వివరణ: ఆనందగోత్రజుల విజయకేతనం గోలాంగులము (కోతి) అని చేజెర్ల శిలా శాసనం చెబుతుంది. అయితే వీరి రాజ లాంఛనం వృషభం. సింహం శాతవాహ నులకు, పంజా విసిరే సింహం విష్ణుకుండి నులకు, గరుడ గుప్తరాజుల రాజ చిహ్నాలు. ఇవి వారి వారి మత విశ్వాసాలను కూడా వ్యక్తీకరిస్తాయి.
17. తాడికొండలో శాక్యభిక్షు విహారం నిర్మించింది ఎవరు?
1) పృథ్వీమూలుడు
2) హరివర్మ
3) రెండో విక్రమేంద్ర వర్మ

4) అనంతవర్మ
జ. 2;
వివరణ: హరివర్మ తాడికొండలో శాక్యభిక్షు విహారం నిర్మించాడు. ఈయన బౌద్ధ మతా భివృద్ధికి కృషి చేశాడు. ఆదుర్రులో కూడా విహారం నిర్మించి, తండ్రి పృథ్విమూలుని నుంచి పొందిన కట్టు చెరువు గ్రామాన్ని దానం చేశాడు. మహామేఘవాహన విహారా నికి కల్వచెరువును దానం చేశాడు. ఇది వర్థమానపురంలో ఉంది. గుణపాశపురంలో ఉన్న లోకవిఖ్యాత మహా విహారానికి
అట్టలువుడ గ్రామాన్ని దానం చేశాడు.
18. శాలంకాయన అంటే అర్థం ఏమిటి?

1) చిలుక
2) సింహం

3) నెమలి
4) నంది
జ. 4;
వివరణ: ఇక్ష్వాకుల అనంతరం ఉత్తర తీరాంధ్రలో అధికారంలోకి వచ్చినవారు శాలంకాయనులు. శాలంకాయన అంటేఅర్థం నంది. శాలంకాయన అనేది గోత్ర నామం. వీరు శైవ మతాభిమానులు.

19. హిరణ్య గర్భయాగం అంటే ఏమిటి?
1) పుట్టుకతో బ్రాహ్మణుడు కాకున్నా యాగం
తో కావడం
2) పుట్టుకతో క్షత్రియుడు కాకున్నా యాగం
తో కావడం
3) పుట్టుకతో వైశ్యుడు కాకున్నా యాగంతో
కావడం
4) పుట్టుకతో శూద్రుడు కాకున్నా యాగంతో
కావడం
జ. 2;
వివరణ: పుట్టుకతో క్షత్రియుడు కాకున్నా హిరణ్యగర్భయాగంతో క్షత్రియుడు కావచ్చు.
ఉదాహరణకు శాలంకాయన రాజు అత్తివర్మ హిరణ్యగర్భ ప్రసవుడను అని చెప్పుకున్నాడు. పాలకులు సంతానం కోసం పుత్రకామేష్ఠి యాగం, రాజ్య విస్తరణకు అశ్వమేథ యాగం
మొదలగు యాగాలు చేసేవారు.
20. ఖారవేలుడు జారీ చేసిన హతిగుంఫా శాసనంఏ భాషలో ఉంది?
1) ప్రాకృతం
2) సంస్కృతం

3) తెలుగు
4) ఒరియా
జ. 1;


Labels